3184) సంతోషమే సమాధానమే ఇకపై మన కొరకెపుడానందమే

** TELUGU LYRICS **

హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయా  హల్లెలూయా 
పల్లవి:సంతోషమే సమాధానమే 
ఇకపై మన కొరకెపుడానందమే 
ప్రియ యేసు రాజుగా వచ్చుచున్నాడు 
తన వారిని ఆయన పిలుచుచున్నాడు 
తృటిలో మానమాయనతో వుందుము 
తన కృపలతో మనలను ప్రేమలో నిలిపెను 
హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయా (4)
||సంతోషమే|| 

శరీర ఆశలు నేత్రాశలు జీవపుడంబము విడనాడి (2)
తప్పులు నీవు ఒప్పుకుంటే నేడే 
పవిత్రపరచును ప్రభు యేసు (2)
యేసును నీవు ఒప్పుకున్న నాడే 
రక్షణ కలుగును తక్షణమే  (2)
ఆ ఆనందమే పరమానందమే 
ఇకపై మన కొరకెపుడానందమే 
హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయా (8)

పరలోకములో పరిశుద్ధుల సహవాసనులో 
మనం నిలచెదము (2)
క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని  
మనమందరము చూచెదము (2)
కన్నీటిని దుఃఖమును 
వేదన నుండి తొలగించును (2)
జీవ జలముల బుగ్గలలోని 
జలమును మనకు ఇచ్చును  
జయించు వారు వీటిని 
పొందుదురు శాశ్వతముగా 
ఆ ఆనందమే పరమానందమే 
ఇకపై మన కొరకెపుడానందమే 
హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయా (4)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------