** TELUGU LYRICS **
రండి రండి సువార్త బోధ విన రారో జనులారా నిండు మనంబుల
కోర్కెలూరగను నిజరక్షకుఁడగు యేసునిఁ జేర
కోర్కెలూరగను నిజరక్షకుఁడగు యేసునిఁ జేర
||రండి||
1. పాపము లెడ బాపను యిలకరిగిన ప్రభువు మహిమ వినుఁడి మీ మీ
పాపములను దలపోసి హృదయముల పశ్చాత్తాపపడి యా పరమగురుని
నామముద్వారా ననుసరించి ముంచడముఁ బొందు

2. తన మహిమను బలమును దైవత్వము తగ్గించుకొని వడి యప్పుడు
తన సేవకుఁడని మదిఁదలపోయని తగు నీతిని గనుఁడీ క్రీస్తుండును
బాప్తి స్తు డు యోహానునిచే మునుకొని యోర్దాన్నదిలో ముంచుటగని
||రండి||
3. మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో ముంచబడినరీతి నిప్పుడు
గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు గైకొనుటది నీతి మరువక స్థిరముగ
మీ మనముల నెల్ల ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగఁజేర

4. తల్లులు తమ బిడ్డల కాశీర్వాదము లిమ్మని తేగా నప్పుడు చల్లగ
బాలుర కాశీర్వాద మెసఁగె ప్రభు విదిగాక క్రీస్తుఁడు తొల్లి జనములకు
ముంచడ మిచ్చిన టెల్ల విధులలేదు వేదమున

5. అందుచేత వేదమున బాప్తిస్తుండనఁబడె యోహాను ఇప్పుడు పొందుగ
ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను మీరలు నందఱు విన సత్య
వేదవాక్యము సందియములు విడి సాగి వేగమున

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :