2918) రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట


** TELUGU LYRICS **

రాజులకు రాజంట - ప్రభువులకు ప్రభువంట 
బెత్లహేము పురములోన - పుట్టెనంట 
సూడసక్కనోడంట పశులపాకలోనంట 
దావీదు కుమారుడంట - లోక రక్షకుడంట
కనులారా ఓహో కనులారా
ఆహా కనులారా సూద్దాము రారండి - బాలయేసుని మ
నసారా కొనియాడ సేరండి - సిన్ని క్రీస్తుని 
||రాజులకు||

పాపమంత బాపునంట - దోషమంత మాపునంట 
కరుణశీలుడు ఆ యేసు - కనికరించె దేవుడంట (2) 
ఇమ్మానుయేలుగ తోడుండునంట - సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట - మంచిమెస్సయ్య (2) 
||రాజులకు||

జ్ఞానులంత జూచిరంట - గొల్లలంత గూడిరంట 
బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట (2) 
రాడ బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట 
దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట
||రాజులకు||

----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
----------------------------------------------------------------------------