2913) రాజుల రాజుగ యేసు ప్రభుండు రయమున రానై యున్నాడు

** TELUGU LYRICS **

    రాజుల రాజుగ యేసు ప్రభుండు
    రయమున రానై యున్నాడు

1.  రక్షణాలంకారముతో - తక్షణమే సిద్ధపడి
    అక్షయుడగు నా రక్షకుని - నిరీక్షణతో వేడండి

2.  మన ప్రభు యేసుని రక్తము - మన పాపములను పోగొట్టి
    మన ప్రభురాకడ మనకెంతో - మహిమానదము కలిగించున్

3.  మొదట గొఱ్ఱెపిల్ల వలె - నొదిగి వచ్చెను మన ప్రభువు
    కొదమసింహముగా వచ్చును - గుండెదిగులు పాపికి

4.  గురుతులన్నియు జరుగుచుండ - సరిగా చూడుము విశ్వాసి
    త్వరపడుము నీ ప్రభుని జూడ - కరములెత్తి ప్రార్థించు

5.  ఎల్లరు క్రీస్తుని రాకను - ఉల్లాసముతో కోరుచు
    హల్లెలూయ పాటలు పాడి - ఎల్లప్పుడు స్తుతియించెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------