2902) రాజాధిరాజా రావే రాజు యేసు రాజ్యమేల రావే

** TELUGU LYRICS **

    రాజాధిరాజా రావే - రాజు యేసు రాజ్యమేల రావే
    రాజులకు రాజువై రావే - రవికోటి తేజ యేసు రావే
    ఓ ... మేఘ వాహనంబు మీద వేగమే
    ఓ ... మించు వైభవంబుతోడ వేగమే

1.  ఓ ... భూజనంబులెల్ల తేరి చూడగా
    ఓ ... నీ జనంబు స్వాగతంబు నీయగా
    నీ రాజ్య స్థాపనంబు చేయ - భూరాజులెల్ల గూలిపోవ
    భూమియాకాశంబు మారిపోవ - నీ మహాప్రభావమున వేగ

2.  ఆ ... ఆకసమున దూతలార్భటింపగా
    ఆ ... ఆది భక్త సంఘ సమేతంబుగా
    ఆకసంబు మధ్య వీధిలోన - ఏకమై మహాసభచేయ
    యేసునాథ! నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ

3.  ఓ ... పరమ యెరూషలేము పుణ్యసంఘమా !
    ఓ ... గొర్రెపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా !
    పరమదూతలారా ! భక్తులారా ! పౌలపొస్తులారా !
    పెద్దలారా ! గొరియపిల్ల యేసురాజు పేర - క్రొత్త గీతమెత్తి పాడరారా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------