2156) పుడమి పులకించే నీ రాకతో ప్రభూ

** TELUGU LYRICS **

    పుడమి పులకించే నీ రాకతో ప్రభూ
    పరము భువికేగే నీ రాకతో ప్రభూ
    జగతి కీర్తించిన ప్రేమ మూర్తివి నీవు
    దివిని అలరించిన దైవ మూర్తివి నీవు

1.  పరవశించే మానవాళి భూదిగంతాలలో
    పరిమళించే సౌరభాలు నిన్ను కీర్తించగా
    నింగిలోన దూత సైన్యం స్తోత్ర గీతం వినిపించగా
    నిండియున్న చీకటంత తొలగిపోయే నీ రాకతో
    పాపి రక్షణకై అవతరించితివా (2)

2.  పరమ దేవుని పరిశుద్ధాత్ముని ప్రేమ సంభందమే
    ప్రభు గావించిన ఇహపరంబుల ప్రేమ సంకల్పమే
    నీ ప్రేమలో నీ చూపులో నీ స్పర్శలో ప్రేమామృతాం
    స్వార్ధమెరుగని నీదు ప్రేమ షరతులుండనీ సాంగత్యమూ
    పాపి రక్షణకై అవతరించితివా (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------