2148) ప్రియుడా ప్రభు యేసునకు నీ వీనుల నిమ్ము

** TELUGU LYRICS **

    ప్రియుడా ప్రభు యేసునకు - నీ వీనుల నిమ్ము
    ప్రియుడా ప్రభు యేసునకు - విశాల స్థలమిమ్ము
    ప్రియుడా ప్రభు యేసునకు - విస్తార ఫలమిమ్ము

1.  సర్వాధికారియైన యేసు - సర్వశక్తి గలవాడు
    సర్వజనులలోన - శిష్యుల జేయుమనెన్

2.  జనముల నీదు స్వాస్థ్యముగ - భూమి దిగంతముల వరకు
    నన్నడుగుడి మీదు సొత్తు - గా నిచ్చెదననెన్

3.  పర్వతముల నీవు యెక్కి - మ్రానులను కొట్టి తెచ్చి
    మందిరము కట్టిన - మది నుల్లసింతుననెన్

4.  కోత సమయమింక కొంత - కాలమున్నదనేదంత
    తెల్లబారిన పొలముల్ - కన్నుల గాంచుమనెన్

5.  ప్రతివాడు తన స్వంత పనులే - చింత గలిగి చేసెదరిలలో
    ప్రభు యేసు పనులన్ నీవు - పాటింప కుండెదవా?

6.  నీ దేహమును నీది కాదు - విలువపెట్టి కొన్నాడేసు
    నీ దేహమాయన కిమ్ము - సజీవ యాగముగ

7.  ప్రతివాని పనుల పరికించి - ఫలము నియ్య ప్రభుడిలకొచ్చున్
    ప్రతిచోట నీవు ఫలములన్ ఫలించుచుండు మిలన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------