1986) ప్రకటించరా ప్రభుయేసు వార్తను

** TELUGU LYRICS **

    ప్రకటించరా ప్రభుయేసు వార్తను
    ప్రవచించరా ప్రభుక్రీస్తు రాకను (2)
    పరలోక రాజ్యము పరవశించు రాజ్యమనీ
    పరిశుధ్ధులు పాలించు ప్రభుయేసుని
    రాజ్యమని (2) 
    ||ప్రకటించరా||

1.  రాయలసీమ రతనాలసీమ కాగ
    పల్నాటిసీమ పగడాలనిధిగ మార (2)
    కోనసీమ తన కంబురాశి కాగ (2)
    దివిసీమ యేసుని హృదయ సీమ కాగ (2)
    ||ప్రకటించరా||

2.  జల్లీసీమ జీవజలమయము కాగ
    పట్టీసీమ పరలోక మహిమసీమ కాగ (2)
    రెడ్డిసీమ రారాజు పీఠము కాగ (2)
    ఈశాన్య ఆంధ్రము యేసయ్యది కాగ (2)
    ||ప్రకటించరా||

3.  తెలంగాణా పులకరించి పుష్పించను
    కోయ బంజారా క్రీస్తేసుచెంతచేర (2)
    హైదరా సికింద్రబాదు హోసన్నని పాడ (2)
    పట్టణా పల్లెల్లో ప్రేమానందమునిండ (2)
    ||ప్రకటించరా||

4.  తెలుగుజాతీ తేజోమయమైనిండ
    జయగీతమెత్తి జైజై అని పాడ (2)
    మారును మన ఆంధ్రావని స్వర్ణాంధ్రగా (2)
    చేరు క్రీస్తు మకుఠమందు మణిపూసగా (2)
    ||ప్రకటించరా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------