2059) ప్రభువా పంపు వర్షమును

** TELUGU LYRICS **   

    ప్రభువా పంపు వర్షమును
    నీ వాగ్దానములు స్థిరపరచి
    భీకర ధ్వనితో రానిమ్ము

1.  ఏలియా మొరపెట్టగానే
    మేఘములు కారుగమ్మెను
    మోపైన వాన - భువిపైన గురిసే
    మా దీన ప్రార్థన వినుమా

2.  కడవరి వాన కాలమున
    వర్షము దయ చేయు మిలలో
    పైరు మొలుచునట్లు ప్రతి చేని లోను
    మెరుపులను పుట్టించుము

3.  దేవా! నీ స్వాస్థ్యము మీద
    సమృద్ధిగా కురిపించుము
    దాహముతోను - దస్సిన మమ్ము
    బలపరచి స్థిరపరచుము

4.  ఆత్మీయ గొడ్డుతనములో
    నలమటించుచున్న మాకు
    ఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచి
    ఉజ్జీవింప జేయు మమ్ము

5.  మా నోట నగ్ని తగిలించి
    మా దోషమంతా తొలగించి
    పంపుము దేవా - నిను సేవించుటకు
    ప్రాపుగ ప్రకటింపనిమ్ము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------