** TELUGU LYRICS **
ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనది
మా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2)
గర్భములో రూపింపబడిన నాటినుండి
కాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2)
నీ సన్నిధిలో నిలిపే దయ చూపవా
నీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)
మా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది (2)
గర్భములో రూపింపబడిన నాటినుండి
కాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా (2)
నీ సన్నిధిలో నిలిపే దయ చూపవా
నీ జ్ఞానములో పెంచే కృపనీయవా (2)
||ప్రభువా||
నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యా
నీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా (2)
తన చేతులతో నీ సేవను చేస్తూ
తన పెదవులతో నిను స్తుతియించాలయ్యా (2)
ప్రార్థనాపరురాలిగ ఉండాలయ్యా
||నీ సన్నిధిలో||
నీ వాక్యము తన హృదయములో పదిలముగా ఉండాలయ్యా
నీ తలంపులు అన్ని వేళలా తన మదిలో నిండాలయ్యా (2)
నీ దయయందు మనుష్యుల దయయందు
వర్ధిల్లేలా నీవే దీవించయ్యా (2)
నీ ప్రియమైన బిడ్డగా స్థిరపరచయ్యా
||నీ సన్నిధిలో||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------