2041) ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను

** TELUGU LYRICS **

    ప్రభువా, గురి యొద్దకే - పరుగెత్తుచున్నాను నేను
    ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని

1.  ఏవేవి లాభకరములై యుండెనో - వాటిని క్రీస్తు నిమిత్తం
    నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను

2.  క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును
    ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్

3.  క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము
    సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను

4.  వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై
    వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments