2070) ప్రభువుకు తగినట్టు నడుచుకొందము రండి

** TELUGU LYRICS **

    ప్రభువుకు తగినట్టు - నడుచుకొందము రండి
    తన్ రాజ్య మహిమకును - తగినట్టు నడుచుకొందము రండి

1.  ఆదాము దేవుని, నిబంధనను మీరి - దారి తప్పిపోయెను (2)
    హానోకు దేవునితో కూడ నడువగా (2)
    తనతో నతనిని కొనిపోయెను

2.  నోవహు దేవునితో కూడ నడిచె - కృప పొందినవాడై
    తనతరములో నీతిమంతునిగా నెంచి - జలప్రళయమునుండి కాపాడెను

3.  అబ్రాము దేవుని సన్నిధిలో నడిచె - నిందారహితునిగా
    దేవుడతనితో, నిబంధనను చేసి - తన స్నేహితుడని ప్రకటించెను

4.  దేవుని యింటి దర్శనము పొంది - ప్రజలను నడిపించెను మోషే
    దేవుని యింటిలో నమ్మకమైన - వాడని ప్రభువే పలికెనుగా

5.  దేవుని కట్టడల ననుసరించి - నడుచుకొనెను దావీదు
    స్థిరపరచెనాతని సింహాసనమును - తన చిత్తానుసారుడని పలికెన్

6.  పేతురు, యాకోవు, యోహానులు - ప్రభువును వెంబడించిరి
    పరలోక సంఘ దర్శనమునిచ్చి - మనుజులను పట్టువారిగా చేసెన్

7.  పునరుత్థానుడైన ప్రభువును గానక - ఎమ్మాయి కెళ్ళిరి శిష్యులు
    యేసే వారితో కూడ నడిచెన్ - గద్దించి వారి కళ్ళు తెరిపించెను

8.  వస్త్రములు అపవిత్రపరచుకొనని - కొందరుండిరి సార్దీసులో
    అర్హులై తెల్లని వస్త్రము ధరించి - సంచరింతురు ప్రభుతో

9.  యేసుని వెలుగులో నడుచుకొందము రండి - జీవముగల దేవుని సంఘమా
    మన అతిక్రమములను ఒప్పుకొనెదము - యేసుతో కలిసి కొనసాగెదం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------