2001) ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు

** TELUGU LYRICS **

    ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు
    దీవెనల వర్షము కుమ్మరించుము

1.  ఓమా యేసు విను మామనవి - మా మధ్యకు ప్రభు రారమ్ము
    నీ ద్వారమున చేరి యున్నాము - నింపుము ప్రభువా మమ్ములను

2.  దప్పిగొన్న వారికి జలము - యెండిన భూమికి జలధారల్
    నీ సంతతిపై ఆత్మను పంపు - నీ దీవెనలతో నింపుము

3.  తండ్రి కుడిప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము
    ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము

4.  రెండు కెరూబుల మధ్య నుండి - మధుర స్వరము విననిమ్ము
    యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము

5.  తెరువబడిన పరమునుచూడ - దూతలు యెక్కుచు దిగుచుండ
    నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments