2130) ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము

** TELUGU LYRICS **

    ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము
    యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము 
    ||ప్రార్ధన||

1.  ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం
    క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము (2)
    ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం
    దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం
    ||ప్రార్ధన||

2.  ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం
    దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం
    ||ప్రార్ధన||

3.  ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం
    ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం
    ||ప్రార్ధన||

4.  ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం
    ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం
    ||ప్రార్ధన||

** ENGLISH LYRICS **

Prardhanalone Gaduputaye Naakentho Bhaagyamu
Yesuthone Sahavaasam Chesedhanu Nithyamu
||Prardhana||

1. Prardhanalo Vaakyamunu - Dorakagaa Bhujinchedham
Kreesthu Manakai Chesina Kaaryamulanni Pogadedhamu (2)
Prardhanalo Sthuthiyinchi Sthothrinchi Paadedham
Devuni Premanu Goorchi Kruthajnyatha Chellintham
||Prardhana||

2. Prardhanalo Nireekshinchi Kanipetteda Chiththam
Devuni Ishtulugaa Nadachi Santhosha Parachedham
||Prardhana||

3. Prardhanalo Jayamulanu Saadhinchi Choopedham
Prardhanache Samasthamu Jariginchi Saagedham
||Prardhana||

4. Prardhinche Vaaramu - Paapamu Cheyaka Vundedham
Prardhanane Oopirigaa Kaligi Jeevinchedham
||Prardhana||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------