2207) పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు

** TELUGU LYRICS **    

    పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము
    పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి
    ||పోపోవే||

1.  సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ
    క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద
    భక్తి మా కెబ్బఁ
    ||పోపోవే||

2.  నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి
    దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై
    ననుఁబిల్చెఁ
    ||పోపోవే||

3.  ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి
    జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి
    యేమున్నది చాలుఁ
    ||పోపోవే||

4.  ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ
    గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు
    డిపు డిచ్చుఁ
    ||పోపోవే||

** ENGLISH LYRICS **

Popove Yo Lokama Chaalika Chaalu Nee Pondu Memu Ollamu
Paapechchalunnatha Sepu Nopaga Raani Vepaatlu Bettithi Veepatla Nanu Veedi
||Popove||

1. Sakalendhriya Vyaapthulu Nee Seva Baayaka Cheyu Divasambu Ika Dheeri Poye
Bhraamikamu Joopaku Mipudu Prakatammuga Kreesthu Padha Bhakthi Maakebba
||Popove||

2. Nee Raaju Bahumaanamu Gantimi Ghora Narakaambudhi Theeramu
Dhaari Tholagi Ninnu Cheri Dhukhamula Vesarithippudu Kreesthu Sadayudai Nanu Bilche
||Popove||

3. Era Joopi Balu Meenamu Battedu Vaani Karani Vasthula Roopamu
Bori Joopi Lobhamu Buttinchi Nanu Batti Parimaarchithivi Inka Mari Emunnadhi Chaalu
||Popove||

4. Endamaavula Thetalu Nee Vichchedu Dandaina Iha Sukhamulu
Kanda Garvamu Che Nee Anda Cherithigaani Nindu Nemmadhi Dhayaa Nidhi Kreesthudipudichchu
||Popove||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------