1959) పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు

** TELUGU LYRICS **

    పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ బొం దుము
    పరిశుద్ధవర్తనకు పరమసాహాయ్యంబుఁ పరముఁజేరువఱకు పరి పూర్తిగా
    దొరకు 
    ||పరి||

1.  పరిశుద్ధాత్మునిఁ గల్గిన మన రక్షణ పరిపూర్ణమై యుండును పరమ
    రక్షకుఁడిచ్చు పరిపూర్ణ రక్షణను పరమానందముతోడఁ పరగఁగైకొను
    మిపుడే
    ||పరి||

2.  పరిశుద్ధాత్మునిఁ గల్గిన బైబిలువాక్య పరమసారము తేటగుఁన్ పర
    మండలపుఁ తండ్రి పరిశుద్ధచిత్తంబు పొరపాటులేకుండ విరివిరిగాఁ
    దెలియును
    ||పరి||

3.  పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ బ్రార్థనలందుఁ పరమ పాటవ మబ్బును
    సరిగాఁ బ్రార్థించెడు సరణియుఁ దెలియును వరములను బొందుటకు
    తెరువులభియించును
    ||పరి||

4.  పరిశుద్ధాత్మునిఁ గల్గిన శోధనములఁ పరమ విజయము గల్గును
    దురితంపు శోధనలఁ దొలగింప నా ప్రభువు పరమశక్తినొసంగి కరుణతో
    జయమిచ్చు
    ||పరి||

5.  పరిశుద్ధాత్మునిఁ గల్గిన జీవితమెల్లఁ పరిశుద్ధముగ నుండును పరిశుద్ధ
    జీవితము కరము సాధ్యంబగును పరిశుద్ధాత్ముని శక్తిన్ వర్తింపఁగలమట్లు
    ||పరి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------