1946) పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు

** TELUGU LYRICS **

    పరిశుద్ధ శ్రీ యేసువే - పరలోకరాజు
    మురియుచు నే పూజింతును - నిరతము
    అను పల్లవి: పరలోక మహిమనుండి - నరుల రాజ్యములలో
    నిరతము తన పాలనము జరిగించుచున్నరాజు

1.  పెనూయేలు పోరాటంబున - పోనివ్వనంచు
    పెనుగునందున యాకోబు - వినయమున
    నన్ను దీవించు తండ్రీ - నిన్ను నే విడువనంచు
    కన్నీటితో వేడగా - ఘనత ఇశ్రాయేలనియె

2.  ఈ దినమున నుండి - పదిలముగ
    ముదముగ దీవింతుననెన్ - ఆదరణకర్త
    తుదిమందిర పునాదిపై - కదలక నిలుచువారిన్
    కదలని నా పునాది - యూదాగోత్ర సింహంబు

3.  సీయోనులోనుండి - ప్రియుడైన యేసు
    కాయుచు నిను దీవించును - ఆయన త్రోవన్
    పాయక నిన్నెప్పుడు - పరిపాలించు చుండును
    రయమున నిన్ను జేరి - సాయంబు చేయుచుండున్

4. జయించుచున్న వానికి - మరుగైన మన్నా
    ప్రియమున భజియింపనిచ్చున్ - జయశాలి
    వ్రాయబడిన క్రొత్తనామ మున్నట్టి తెల్ల
    రాయినొసంగి వాని భయము తొలగించు జయము

5.  నడిపించుచుండి నిత్యము - తన దృష్టి నిలిపి
    విడువకుండగ నీ ప్రభు - కడవరకు
    ఎడతెగని తనదు ప్రేమ - కనుపరచి తృప్తిపరచి
    చెడుగునెల్లను బాపి - తన యడుగు జాడలలో

6.  బలము నారోపించుము - బలమిచ్చు ప్రభువు
    సిలువలో నీకై సమసెను - సీయోను
    గెలిచె సమాధినుండి - బలముతో తిరిగిలేచె
    ఎల్ల మేలుల తలచి - హల్లెలూయ పాడెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------