** TELUGU LYRICS **
పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర
తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు
డేసునిఁ గూడి

||పదరే||
1. ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక
కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద
కున్న నష్టము గల్గుఁ
||పదరే||
2. ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి
నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త
సరణిఁ గన్గొని వడిగఁ

3. ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను
భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో
టను నా పాటే దీరుఁ

4. పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును
పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక
సరకు సేయుము పద

5. ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ
బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు
అహహా యేసుని జూడ నధిక సంతోషంబు

6. మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా
త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి
తోడుగ నునిచె వేగము గూడి

7. భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ
గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా
సక్తితోఁ జూతము

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :