2114) పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు

** TELUGU LYRICS **

    పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు
    నీ రక్షణకై స్తోత్రములు

1.  అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు
    ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను

2.  పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి
    నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా

3.  అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని
    అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా

4.  నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు
    నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు

5.  మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం
    మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను

6.  నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య
    రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------