2108) పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి

** TELUGU LYRICS **

    పాపిని నేను తప్పితి – భువిలో రక్షించెడి వారెవరు
    ఓ ప్రభు యేసు నిరీక్షణతో – నీ దరికి జేరితిని

1.  ప్రభువా పాపిని రక్షించుటకు – ఈ భువి కరుదెంచితివి
    దౌర్భాగ్యుడను వేడితి శరణం – వేరేమి చేయలేను

2.  జీవము నివ్వ వచ్చితివి – చచ్చి యుంటి నేను
    బంధింపబడితిని మరణ బంధముతో – విడిపించెడి వారెవరు

3.  జన్మముతోనే అపవిత్రుడను – నా స్వభావమే పాపం
    క్రియలలోను మాటలయందు – నీకు విరోధినైతిని

4.  స్వంత నీతితో నిండిన పనులు – మరి పుణ్య కార్యములు
    ఆచారములతో చిక్కుకొన్నాను – తప్పించెడి వారెవరు

5.  భరియించితివి పాపపు శిక్ష – ప్రాణమిచ్చితివి నాకై
    రక్తము కార్చి సర్వమిచ్చితివి – నన్ను రక్షించుటకై

6.  ఓ ప్రభు యేసు దయాళుడ వీవు – కృంగివచ్చుచున్నాను
    నా పాపములు క్షమియించు ప్రభువా – గొప్ప రక్షణకర్త వీవే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------