2097) పాపము వలనఁ చెడినవానిఁ ప్రేమతో వెతకి రక్షించుఁడు

** TELUGU LYRICS **

1.  పాపము వలనఁ చెడినవానిఁ
    ప్రేమతో వెతకి రక్షించుఁడు
    తప్పినవానిని ద్రోహిని మీరు
    యేసుని యొద్దకు రమ్మనుఁడు.

    ||పడినవారికిఁ జూపుఁడు త్రోవ
    యేసు పాపాత్ములన్ రక్షిం
    చును||

2.  నీతిని కోరక యల్లాడువాని
    యేసు రక్షించుటకై కాచును
    ప్రేమతో వారినిఁ బిలుచుకొండి
    యేసును నమ్మిన రక్షించును.

3.  పాపవిషంబు మనస్సున దాగి
    గుణము పూర్తిగఁ జెఱిపినన్
    యేసుని ప్రేమ యనుకిరణంబు
    దాని గుదుర్చును పూర్ణముగా.

4.  చెడినవారిని రక్షింపఁ బొండి
    యేసుఁడు శక్తిని మీ కీయఁగా
    మోక్ష మార్గంబునడిపించుండి
    వారిని రక్షింప యేసు వచ్చెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------