** TELUGU LYRICS **
పాప సముద్రమందు - పగిలె నా హృదయనావ
నావను దరికి యేసు - నడిపించు చక్కజేసి
నావను దరికి యేసు - నడిపించు చక్కజేసి
1. ప్రక్కలో కారిన రక్త - చుక్కల దర్శనమిమ్ము
నా తండ్రి నడుపు సత్య - నూతన మార్గమందు
2. నజరేయుడా యేసు నీదు - నాణ్యంపు ముఖమును జూపి
స్వస్థపర్చు రోగుల - సర్వజనుల బ్రతికించు
3. సీయోను పర్వత మహిమ - చూపించుము ఎల్లరికి
నా హృదయముపైనున్న - నల్ల తెరను చింపుము
4. నా ప్రాణ ప్రియుడా యేసు - నా ప్రార్థన వినుమా
సంపూర్ణునిగా చేయు - నీ చక్కని దర్శనమిచ్చి
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------