** TELUGU LYRICS **
నిత్యము - నిలుచునది - దేవుని వాక్యము
సత్యమై యున్నది - సర్వము చేయునది (2)
అను పల్లవి: ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము
సత్యమై యున్నది - సర్వము చేయునది (2)
అను పల్లవి: ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము
1. అంధకారమును - తొలగించు జ్యోతి అది
ప్రతి మనిషిని వెలిగించు - మహిమ వెలుగు అది (2)
వెలిగించును - నడిపించును - త్రోవకు దీపమై (2)
ఆ వెలుగు వాక్యము
2. ఎండిన ఎడారిలో - నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు - జీవనదియే అది
దప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునది
ఆ జీవ జలవాక్యము
వడిగా ప్రవహించు - జీవనదియే అది
దప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునది
ఆ జీవ జలవాక్యము
3. అపవాదిని అణచివేసె - ఆత్మఖడ్గమది
రెండంచులు వాడీగలదై - వధించును వైరులను
ఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడు
ఆ శక్తిగల వాక్యము
రెండంచులు వాడీగలదై - వధించును వైరులను
ఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడు
ఆ శక్తిగల వాక్యము
4. పోరాడుము యేసుకై - మంచి సైనికునిగా
శ్రమలను భరించుము - వాక్యములో బలమొంది
తన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరము
ఆ దేవాది దేవుడు
శ్రమలను భరించుము - వాక్యములో బలమొంది
తన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరము
ఆ దేవాది దేవుడు
5. నిత్యుడగు దేవుడు - త్వరగా వచ్చుచున్నాడు
జయించు వారినెల్ల - తనతో కొనిపోవును
తన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుము
ప్రభుకొరకై కనిపెట్టుము
హల్లెలూయా హల్లెలూయ - హల్లెలూయా హల్లెలూయ (2)
జయించు వారినెల్ల - తనతో కొనిపోవును
తన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుము
ప్రభుకొరకై కనిపెట్టుము
హల్లెలూయా హల్లెలూయ - హల్లెలూయా హల్లెలూయ (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------