1619) నిరాకార సురూపుడా మనోహరా

** TELUGU LYRICS **

    నిరాకార సురూపుడా మనోహరా
    కరిగితివా నాకై వ్రేలాడుచు - సిలువలో

1.  వారుల దెబ్బలబాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడి
    తీరని దాహము సహించితివి - సిలువలో

2.  మానవులు ఏడ్చి ప్రలాపింప - భూరాజు లెల్లరు మాడిపోగా
    శిష్యుల డెందములు పగుల - సిలువలో

3.  అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరి నే నీ పాదముల బడితిని
    కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో

4.  కోరి సిల్వభారమును మోసితివి - పాపభారమును ద్రుంచితివి
    ఘోర గాయములు పొందితివి - సిలువలో

5.  నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ - పెన్నుగ నీవు సహించితివి
    నన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో

6.  కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా - నీదు రక్తమును పారెనయ్యా!
    తీరుగా నే రక్షణ పొందను - సిలువలో

7.  ఒక్కడుగు నిత్య దేవినికే - ఒక్కడుగు సుతుడేసునకే
    ఒక్కడుగు సత్య ఆత్మ నీకే – హల్లెలూయా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments