1583) నిను నమ్మినచో సిగ్గుపడనీయవు

** TELUGU LYRICS **

    నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
    నను నెమ్మదితో నీవే ఉంచెదవు
    ఆపత్కాలమున నమ్ముకొనదగిన
    అ.ప: యేసూ నీవే ఆధారము
    యేసూ నీవే నా ప్రాణము

1.  తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను
    బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను

2.  బలమును నమ్ముకొని భంగపడ్డాను
    శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను

3.  ధనమును నమ్ముకొని దగాపడ్డాను
    సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను

4.  మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
    సత్యవంతుడా ఆశ్రయుడవని
    నీ చెంతకు చేరాను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------