1621) నిశ్చయముగ నిన్ను దీవించెదను

** TELUGU LYRICS **

    నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)
    నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)

1.  ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తిగల యెహోవాను నేను
    నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన - నీతో నిబంధన నియమింతును

2.  నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను
    నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున్

3.  యుగయుగములు నీకు దేవుడను - కనాను దేశము నీకొసగెదను
    నిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను - నీలో మహిమ నే పొందెదను

4.  గొప్ప జనముగా జేసెదనిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్
    నీనామమును గొప్ప జేసెదను - ఆశీర్వాదముగ జేసెదను

5.  నిన్నాశీర్వదించువారిని - నేను ఆశీర్వదించెదను
    దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------