1754) నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయాను

** TELUGU LYRICS **

    నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయాను
    దుమ్ములా ధూళిలా ప్రాణం పోవునంతలా
    తనువులోను మనసులోనూ
    శత్రు మిత్రుల చేతుల్లోను
    నలిగి పోయాను నేను విరిగిపోయాను (2)
    ||నీళ్ళలా||

1.  పోయిందని అనుకున్న ప్రాణం తిరిగి దక్కేలా
    దక్కిన ప్రాణం క్రొత్త బతుకును ప్రారంభించేలా
    దేవునికి మానవునికి ఉపకరించేలా
    నలిగి పోయాను నేను విరిగిపోయాను (2)
    ||నీళ్ళలా||

2.  లోకులు చూపె ప్రేమలోని స్వార్ధం ఎరిగేలా
    క్రీస్తులోని నిస్వార్ధ ప్రేమకు అర్ధం తెలిసేలా
    అదృశ్యమైనవి నిత్యములంటు గ్రహింపు పొందేలా
    నలిగి పోయాను నేను విరిగిపోయాను (2)
    ||నీళ్ళలా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------