1750) నీలి గగనాన వెలిగే తారల బోలి లోకాన వెలుగుదం

** TELUGU LYRICS **

    నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం
    మధుర స్వరంపు పక్షుల బోలి - యేసునకే స్తుతి పాడుదం

1.  పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగా
    పూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము

2.  చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ
    నీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును

3.  దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్
    ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------