1729) నీ ప్రేమయే నాకు చాలు నీ తోడు నాకుంటే చాలు


** TELUGU LYRICS **

నీ ప్రేమయే నాకు చాలు - నీతోడు నాకుంటే చాలు 
నా జీవితాన - ఒంటరి పయనాన 
నీ నీడలో నన్ను నడిపించుమా 
||నీ ప్రేమయే||
యేసయ్యా.. ఆ.. ఆ.. యేసయ్యా..ఆ..ఆ.. యేసయ్యా..ఆ..ఆ... 
యేసయ్యా... యేసయ్యా... 

నీ ప్రేమతోను నీ వాక్కుతోను - నిత్యము నన్ను నింపుమయ్యా 
నీ ఆత్మతోను నీ సత్యముతోను - నిత్యము నను కాపాడుమయ్యా 
నీ సేవలో నీ సన్నిధిలో - నీ మాటలో నీ బాటలో 
నిత్యము నను నడిపించుమయ్యా
||యేసయ్యా||

నువు లేక నేను జీవించలేను - నీ రాకకై వేచియున్న 
నువు లేని నన్ను ఊహించలేను - నాలోన నివసించుమన్న 
ఊహలో నీ రూపమే - నా ధ్యాసలో నీ ధ్యానమే 
నీ రూపులో మార్చెనయ్యా 
||యేసయ్యా||

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
---------------------------------------------------------------------------------------