1657) నీ చెంతకో ప్రభో నే జేరెదన్

** TELUGU LYRICS **

1.  నీ చెంతకో ప్రభో - నే జేరెదన్
    కష్టంబు లేచినన్ - నిన్ జేరెద
    నా పాట యెప్పుడు - నీ చెంత నుండును
    నీ చెంత నుందును - నా రక్షకా

2.  భానుండు ద్రిమ్మరి - యిట్టిప్పుడు
    క్రుంకంగ నిక్కడ నా చుట్టును
    చీకట్లు గ్రమ్మినన్ - స్వప్నంబు నందును
    నీ చెంతనుందును - నా రక్షకా

3.  ఆకాశమండల - మార్గంబును
    నాకీవు చూపుమా - నీ కూర్మిచే
    నీ దివ్యదూతలు - నన్ గోరి పిల్వగా
    నీ చెంతనుందును - నా రక్షకా

4.  నే నిద్రలేక నీ - స్తోత్రంబుతో
    శోకంపు రాళ్ళుగ - బేతేలును
    నీకై నిర్మింతును - నా దుఃఖమందున
    నీ చెంతనుందును - నా రక్షకా

5.  ఆనంద పూర్ణమై - పక్షంబులన్
    నాకంబు నంటుచు - నే లేచినన్
    నా పాటయంతయు - నీ చెంతనుండు
    నీ చెంతనుందును - నా రక్షకా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------