1835) నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకొన్నాను

** TELUGU LYRICS ** 

    నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకొన్నాను
    సమాధాన సంతోషము అనుభవించితి నేను

1.  ప్రభువాక్యము నా పాపముచూపె – హృదయము విరిచె ఆయన ఆత్మ
    గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని – కోరితి రక్తము మదిలో

2.  ప్రభు నాపాపము చూపించగానే – ఒప్పుకొంటిని కప్పుకొనక
    విశ్వాసముతో కన్నీటితో – ఒప్పుకొనగ క్షమియించె

3.  పడమటికి తూర్పెంత దూరమో – నా పాపమునంత దూరపర్చితివి
    సముద్ర అగాధములలోన – నా పాపము పడవేసె

4.  మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె – నాశన గోతిలో నుండిలేపి
    నీ వీపువెనుక నా పాపములు – పారవేసితివి వీవు

5.  తుడిచితిననె ప్రభు నా పాపములు – జ్ఞాపకముంచుకొననని చెప్పె
    మంచు విడిచిపోయినరీతి – నా పాపము తొలగించె

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------