1842) నే నీవాఁడనై యుండఁ గోరెదన్

** TELUGU LYRICS **

1.  నే నీవాఁడనై యుండఁ గోరెదన్
    యేసు ప్రియ రక్షకా
    నీవు చూపు ప్రేమను గాంచితిన్
    నన్నుఁ జేర్చు నీదరిన్
    || నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా
    నీవు పడ్డ సిల్వకున్
    నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా
    గాయపడ్డ ప్రక్కకున్ ||

2.  నన్నుఁ బ్రతిష్ఠపర్చుమీ నాధా
    నీదు కృపవల్లనే
    నాదు నాత్మ నిన్ను నిరీక్షించు
    నీ చిత్తంబు నాదగున్

3.  నీదు సన్నిధిలో నిఁక నుండ
    నెంత తుష్టి నాకగున్
    స్నేహితుని మాటలాడెదన్
    సర్వశక్త ప్రభుతో

4.  నీదు దివ్య ప్రేమాతిశయము
    ఇహ బుద్ధి కందదు
    పరమందున దాని శ్రేష్ఠత
    నే ననుభవించెదన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------