1330) నన్ను సృజియించిన ఆదేవుడు ఎక్కడ ఉన్నాడో


** TELUGU LYRICS **

నను సృజియించిన ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో
అని ఊరువాడ చెట్టుపుట్ట అన్నీ వెదికాను (2) 
సృష్టినే దేవుడని - నేను పూజించాను 
సృష్టికర్తను మరచి - నేనెంతో వగచాను  
||నను||

వెదకిన దేవుడు దొరకక పోగా - నేనే దేవుడని సరిపెట్టుకున్నాను (2) 
రక్తము కార్చినవాడే దేవుడని (2) 
తెలిసిన క్షణమున సిలువను చేరితి  
||నను|| 

మత చట్రములో దేవుని బంధించి - విదేశీయతను క్రీస్తుకు ఆపాదించి(2) 
నిజ రక్షకుని అంగీకరించక (2) 
నిష్టగ నరకాన చేరుట న్యాయమా? (2) 
నను సృజియించిన ఆ దేవుడు - యేసులో ఉన్నాడు 
అని ఊరు వాడ పల్లె వెళ్ళి తిరిగి చెబుతాను (2) 

---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)
---------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments