** TELUGU LYRICS **
నన్ను కాపాడు నా దేవుడు - కునుకడు కునుకడు
నన్ను రక్షించు నా యేసుడు - నిద్రపోడు నిద్రపోడు
అ.ప: స్తుతులకు పాత్రుడు - స్తోత్రార్హుడు
మృత్యుంజయుడు - నిత్యముండువాడు
||నన్ను||
వేటగాని ఉరినుండి - విడిపించువాడు
ఏ తెగులు రాకుండా - రక్షించువాడు
తన రెక్కల చాటున - నన్ను దాచువాడు
తన మార్గములన్నిటిలో - నన్ను నడిపించువాడు
||స్తుతులకు||
గాఢాంధకారములో - తోడుండువాడు
ఏకీడు రాకుండా - కాపాడువాడు
నా కన్నీరంతటిని - తుడిచివేయువాడు
నా ప్రార్ధనలన్నిటిని - ఆలకించువాడు
||స్తుతులకు||
-------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
-------------------------------------------------------------------------------------