1335) నమస్కరింప రండి దావీదు పుత్రుని

** TELUGU LYRICS **

1.  నమస్కరింప రండి
    దావీదు పుత్రుని
    శ్రీ యేసు రక్షకుండు
    ఏతెంచె భూమికి
    న్యాయంబు లోకమందు
    స్థాపించి నిత్యము
    అన్యాయ మంతఁ దాను
    పోఁగొట్టవచ్చెను.

2.  వర్షంబు పడునట్లు
    శుష్కించు నేలను
    దుఃఖించు వారి కెల్ల
    హర్షంబు నిచ్చును
    శ్రీ యేసు రాజ్యమందు
    సద్భక్తులందఱు
    ఖర్జూర వృక్ష రీతిన్
    వర్ధిల్లుచుందురు.

3.  దిగంతవాసు లైన
    భూరాజు లందఱు
    శ్రీ యేసు చరణంబుల్
    నమస్కరింతురు
    భూలోకవాసులైన
    జనంబు లందఱు
    క్రీస్తు స్వాధీనమందు
    జీవింతు రెప్పుడు.

4.  విరోధులైన వారిన్
    జయింప నెన్నఁడున్
    సింహాసనంబుమీఁద
    ఆసీనుఁడగును
    అత్యంత ప్రేమమూర్తి
    శ్రీ యేసు ప్రభువు
    ఆ దివ్య నామకీర్తి
    వ్యాపించు నీ భువిన్.

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------