1532) నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు

** TELUGU LYRICS **

    నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు
    లోకంలో ఉన్నవారికంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు
    వేలెత్తి చూపలేని పరిశుద్ధుడు వెల్పులలో అటువంటి వాడెవడు

1.  రాతి నుండి నీళ్ళను ఇచ్చినాడు
    రాకాసి అలలను అనచినాడు
    సంద్రాన దారినే వేసినాడు
    సంతోష వస్త్రమే ఇచ్చినాడు

2.  లాజరు లేచి రా అని పిలిచినాడు
    మరణపు ముళ్ళును విరచినాడు
    మరణించి తిరిగి మరలా లేచినాడు
    మా కొరకు మరలా రానున్నాడు

    నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు
    లోకంలో ఉన్నవారికంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు
    వేలెత్తి చూపలేని పరిశుద్ధుడు వెల్పులలో అటువంటి వాడెవడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------