1389) నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి

** TELUGU LYRICS **

    నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము శ్రీ యేసువా లోక
    రక్షక నన్ను నీ లోపల దాగి వీఁకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా 
    ||నాకై||

1. చీలఁబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము చాల నా
    పాపపు తీర్పు పాపబలమ్ము చాలు రూపును మాపి నన్నుఁ బావనుఁ జేయు
    ||నాకై||

2.  నీదు న్యాయంబగు ప్రామన్య విధులను నాదు సత్కృతి తృప్తిగా
    నాదరింపవు పారమార్థకమైనట్టి నాదు నాసక్తి బాష్పమును బారిన నాకు
    ||నాకై||

3.  నేను జేసిన పాపములఁ ద్రుంప నెవరిని గాన నేరను యేసువా దీనుఁ
    డనై వచ్చి నీ మేటి సిల్వను మానక నే హత్తుకొనియెద సచ్చరిత
    ||నాకై||

4.  కట్టఁ బుట్టము లేక పుట్టముకై యాశ బుట్టి నీ యెడ వచ్చితి నెట్టి
    సహాయము లేక నీపై మదిఁ బుట్టి నీ సత్కృఋపఁ బొందఁజూచెద నయ్య
    ||నాకై||

5.  పరమకల్మషుఁడనై నే నీటి ఋగ్గకుఁ బరుగు లెత్తెద నిప్పుడు పరమ
    పావన నన్ను( గడుగుము లేకున్న మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర
    ||నాకై||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------