** TELUGU LYRICS **
నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేననాధ సాధు జనులఁ బ్రోచు
సదయు నీ దయ కాదా
సదయు నీ దయ కాదా
||నాధ||
1. గతిఁ దలఁపని మూర్ఖచిత్త గమనుఁడనే గానా సతతముననుఁ గరుణఁ
బ్రోచెడు గతియ నీవు కావా
||నాధ||
2. పాపమందు జననమైన పామరుండ నేఁగానా కటకట ననుఁ గని
కరించు కరుణ నీది గాదా

3. కుటిల బుద్ధిగల వాఁడను క్రూరుఁడ నేఎఁగానా కటకట ననుఁ గని

4. ఆది కర్త వీవు గావె యఖిల లోకమునకును బీదవారి నెల్లఁ బ్రోచు
బిరిదు నీది గాదా

5. సారమైన సత్యశాస్త్ర సార మీవు గావా ఘోరమైన పాపి జనులఁ
గోరి పిలువ లేదా

6. జీవ నాధారమైన త్రోవ నీవు గావా దేవదేవ యెహవా నా దిక్కు నీవు
గావా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :