1537) నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నను బ్రతికించినది


** TELUGU LYRICS **

నా వేదనలో ఆవేదనలో  
నీ వాక్యమే నను బ్రతికించినది తాడ ప్యాడ 
నా రోదనలో నా యాతనలో 
నీ మాటలే నను ఓదార్చినవి 
యేసయ్యా... యేసయ్యా (2) 
నీ ఉపదేశమునే - మరువలేనయ్యా (2) 
||నా వేదనలో||

1. చేయని నేరము - చేసెను గాయము 
వేసిన నెపము - మోపెను భారము (2) 
నా కృప చాలును - అన్న నీ మాటే 
నను బ్రతికించెనయ్యా (2)
యేసయ్యా... యేసయ్యా (2) 
నీ వాత్సల్యమునే - మరువలేనయ్యా (2) 
||నా వేదనలో||

2.చేసిన మేలే - కీడుగా మారె 
చూపిన ప్రేమే - చేదుగా మిగిలె (2) 
నీ ఒంటరినైన నన్ను - చేరదీసావే 
నన్ను - ఆదరించినావే (నడిపించినావే) (2) 
యేసయ్యా... యేసయ్యా (2) 
నీ మమకారమునే - మరువలేనయ్యా (2) 
||నా వేదనలో||

----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
----------------------------------------------------------------------------