1545) నా సర్వమైన ప్రభూ అర్పించుకొందు నీకై

** TELUGU LYRICS **

    నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై
    అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై

1.  ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు
    అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా
    జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత

2.  వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో
    నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో
    ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత

3.  నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును
    నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము
    మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments