1490) నా ప్రియునికి ఒక తోట వున్నది

** TELUGU LYRICS **

నా ప్రియునికి ఒక తోట వున్నది
దానిలో మందను మేపుచుండెను
పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను
ఆత్మతో సత్యముతో – ఆరాధించు కాలము
జీవజలములు ఊరెడు బుగ్గగ – చల్లని గాలులు వీచుచున్నవి
నా మంచి కాపరి యేసుడు – నా గొప్ప కాపరి దేవుడు
కృపయే బలముగా – ప్రేమే ఫలముగా
ఆవగింజ చెట్టాయెను – ఆకాశ పక్షులు నివసించెను
హల్లెలూయా గీతాలు పాడుచుండెను – పరలోక రాజ్యము ఆలకించెను
నా ప్రియునికి ఒక తోట వున్నది
దానిలో మందను మేపుచుండెను
పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments