1492) నా ప్రేమరాజు కాపరి నన్నెంతో ప్రేమించును

** TELUGU LYRICS **

1.  నా ప్రేమరాజు కాపరి - నన్నెంతో ప్రేమించును
    ఈ రాజు వాడనైనచో - నా కెట్టి లేమిలేదు

2.  పోషించి నాదు నాత్మకు - జీవంపు నీటినిచ్చున్
    పోషించు దాని నిత్యమున్ - జీవాహారంబుతోను

3.  నే త్రప్పుత్రోవనుండగా - రక్షింప వెదకె నన్ను
    మోదంబుతో కనుగొనెన్ - నన్ మందలోన జేర్చెన్

4.  పాతాళం యొక్క చీకటి - నన్ భీతిపర్చబోదు
    నా దాపునుండ క్రీస్తేసు - నా ముందు నిల్చున్ సిల్వ

5.  నా దృష్టిలో నాహారము - సిద్ధంబు జేతు వీవు
    నీ శుద్ధ ప్రేమానందముల్ - పారెన్ రక్షింప నన్ను

6.  నీ మంచి నైజంబో ప్రభూ - నిరంతరంబు నిల్చున్
    స్తోత్రింతు నిన్ను నీయింటన్ - ఓ కాపరి నా యేసు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments