1479) నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతి హోమములన్ని

** TELUGU LYRICS **

    నా ప్రార్థనలన్ని ఆలకించినావు
    నా స్తుతి హోమములన్ని - నీకే అర్పింతుము
    నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
    నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు

1.  అడిగినంతకంటె - అధికముగా చేయు
    ఐశ్వర్యవంతుడవు - నీవే యేసయ్యా
    పరిపూర్ణమైన - నీ దైవత్వమంతా
    పరిశుద్ధతకే - శుభ ఆనవాలు 
    ||నా ప్రార్థన||

2.  ఆపత్కాలములో మొరపెట్టగానే
    సమీపమైతివే నా యేసయ్యా
    సమీప భాందవ్యములన్నిటికన్నా
    మిన్నయైనది నీ స్నేహబంధము
    ||నా ప్రార్థన||

3.  ఎక్కలేనంత ఎత్తైన కొండపై
    ఎక్కించుము నన్ను నా యేసయ్యా
    ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
    ఆత్మీయతకే స్థిరపునాదులు
    ||నా ప్రార్థన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments