1473) నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము

** TELUGU LYRICS **

నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము
నీ ప్రభు చేసిన మేలులలో ఒక్కదానినైన నీవు మరువకు (2)
అనుదినము ధ్యానించుచు
కృతజ్ఞతార్పనలు చెల్లించుము (2)

పాపపు ఊభిలో నీవు మునిగియుండనేల
నీ దోషములను క్షమియించి లేవనెత్తును
సమాధిలోన నీవు విసిగియున్న వేళ
నిను విమోచించి కరుణ కటాక్షముల నిచ్చును (2)
పక్షిరాజు యవ్వనమును దయచేసి
మేళ్ళతో నీ హృదయము తృప్తి పరచును
యేసు నామములోనే నీకు రక్షణ
యేసు నామములోనే నీకు స్వస్థత
యేసు నామములోనే నీకు నెమ్మది
యేసు నామములోనే నిలుపు నీ మది 
||నా ప్రాణమా||

కొండల తట్టు నీ కన్నులెత్తుము
నీ సహాయము దయచేయు దేవుడు
ఇరు వైపులా శత్రువు తరుముచున్ననూ
ఏ అపాయము దరికి చేరనీయడు (2)
విశ్వాస కవచమును ధరించుము
విజయ వీరుడవై ముందుకేగుము
యేసు నామములోనే నీకు విడుదల
యేసు నామములోనే నీకు క్షేమము
యేసు నామములోనే నీకు విజయము
యేసు నామములోనే నిత్యజీవము
||నా ప్రాణమా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments