1411) నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా

    నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా
    కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు

1.  అంధకార లోకములో అంధుడనై నేనుండగా
    పందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము

2.  లోకములో మాయలకు లోకుల మోమాటముకు
    లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా

3.  ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్
    సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా