** TELUGU LYRICS **
మీరేమి వెదకుచున్నారు?
సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే
సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే
1. నా చెడు మార్గమును విడచితిని - నీచపు జీవితమును విడచితిని
ఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను
ఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను
2. యెహోవా యొద్ద వరమడిగితిని - యెహోవా ప్రసన్నత చూడ
బహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్
బహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్
3. ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను - తానే సమస్తము విత్తుననె గదా
క్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను
క్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను
4. దేవుని చిత్తము నే నెరుగుచును - ఆత్మచే దానిని నెర వేర్చెదను
సీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను
సీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను
5. ప్రార్థన సహవాసమును పొంది - రొట్టెను విరుచుటలో యెడ తెగక
దేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు
దేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------