2480) మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు

** TELUGU LYRICS **

    మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను
    ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు
    రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు 
    ||మేఘంబు||

1.  యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే
    భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య
    విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు
    ||మేఘంబు||

2.  గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు
    వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు నా ప్రభువట్లెమరల యలర వచ్చుట
    మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె
    ||మేఘంబు||

3.  శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును
    యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు
    రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే
    ||మేఘంబు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------