2375) మరియకు సుతుడుగ ధరను జన్మించి

** TELUGU LYRICS **

    మరియకు సుతుడుగ ధరను జన్మించి
    ఇమ్మానుయేలాయెన్
    అను పల్లవి: నిరుపేదగాను పశువుల పాకలో
    తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను

1.  పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
    పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్

2.  ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్
    హీన సైతానుడు కూలిపోవగన్ - ప్రియముతో ఉదయించెన్

3.  దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ
    కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------