2294) మంచివాడా మంచివాడా చాలా చాలా మంచివాడా

** TELUGU LYRICS **

మంచివాడా మంచివాడా 
చాలా చాలా మంచివాడా (2)
నీదు కృపానే ధరాలముగా 
మాపై కుమ్మరించువాడా 

పాపిగా నేనుండకూడదని
నాకొరకే నీవు దిగివచ్చావు
దోషిగా నేనుండకూడదని
నా శిక్షా యావత్తు నీవు పొందావు (2)
నీ త్యాగముతో మార్చి, రక్తముతో కడిగి
నను శుద్ధిగా చేసి, యోగ్యునిగా చేసి (2)
నిత్య జీవమునే అందించావు ఓహోహో
నీ యొక్క కరుణనే కుమ్మరించావు

ఉగ్రత నాపై రాకుడదని
నీతిమంతునిగా తీర్చివేశావు
శత్రువునేమాత్రం కాను అని
సమాధానముతో నింపివేశావు (2)
నీ హస్తముతో కాచి, రెక్కలలో దాచి
శుద్ధాత్మునినే పంపి, నను ధైర్యముతో నింపి (2)
నా విశ్వాసమునే స్థిరపరిచావు ఓహోహోః
నీ యొక్క ప్రేమనే కుమ్మరించావు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------