2341) మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము

** TELUGU LYRICS **

    మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంత
    వీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసి
    నినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము ||మనస||

1.  హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁ
    డిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమున
    కెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁ
    జూపి 
    ||మనస||

2.  ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందు
    చుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు ధరణి
    రత్న రాసులైనఁ జాలువా మరేవి యైన
    ||మనస||

3.  ఎందుఁ గానరాని ప్రేమను జూపించి నీకై పొందుగాఁ దన ప్రాణ
    మిచ్చెను చిందిన రక్తమును యాగ మంది నట్టి శరీరంబు నందముగను
    రాత్రి భోజ నంబు నందు సిద్ధపరచె
    ||మనస||

4.  యేసు తనదు బల్లమీఁను సుజీవ మిచ్చు నెల్ల నష్టములు నశించును
    భాసురముగ మోక్షమునని వాసివై శ్రీ యేసుతోడ యీ సుభో జనంబు
    దినుట కాశీర్వాదములు నొసంగు
    ||మనస||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------